ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందించాలి.

May 22, 2026 - 21:44
May 22, 2026 - 21:45
 0  0
ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందించాలి.

హాస్పటల్ పై దాడులు చేయొద్దు.  సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.

హాస్పిటల్స్, హాస్పిటల్స్ సామాగ్రిని ద్వంసం చేసిన, హాస్పటల్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ తెలిపినారు. సూర్యాపేట లో హాస్పిటల్స్ పై దాడి, సామాగ్రి డామేజ్, సిబ్బందిపై దాడులు లాంటి సంఘటనలు జరుగుతున్న సందర్భంగా సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యం వారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారికి వినతి పత్రం అందజేశారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ హాస్పిటల్స్ వచ్చే రోగులకు, ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించాలని ఐఎంఏ డాక్టర్లకు సూచించారు, ప్రజల నమ్మకం చూరగొనే విధంగా వైద్యం చేయాలని తెలిపినారు. నాణ్యమైన పరికరాలు నైపుణ్యం ఉన్న సిబ్బందిని హాస్పిటల్స్ నందు నియమించాలని తెలిపినారు.

ప్రైవేట్ ఆస్పత్రి నందు వైద్య నిమిత్తం వచ్చిన ప్రజలు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రి యాజమాన్యాలను ఆసుపత్రులను లక్ష్యంగా దాడులు లాంటివి చేయకూడదని, సామాగ్రిని ధ్వంసం చేయడం సిబ్బందిని గాయపరచడం లాంటివి చేయకూడదు అని తెలిపారు ఇలాంటివి చట్టపరంగా నేరమని అన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాల నందు నాణ్యమైన వైద్యం అందుతుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వినతి పత్రం అందజేసిన దానిలో సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ దాంగ్డే, జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ అనూష, డాక్టర్ సుప్రజ, డాక్టర్ శ్రీరామ్ ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333