ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ 

Apr 22, 2026 - 19:19
Apr 22, 2026 - 19:23
 0  1
ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ 

సూర్యాపేట, 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గత కొన్ని సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి తక్షణమే పరిష్కరించి సమ్మె ను విరమింప చేసే ఆలోచన చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు.  స్థానిక సూర్యాపేట డిపోలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆర్టీసీలో గత పది సంవత్సరాల కింద ఉన్న వేతనాలు తీసుకుంటున్నారని, 2021 2025 వేతన సవరణ చేయకపోవడం వల్ల ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నారని,, ఉద్యోగ భద్రత ఊసే లేకుండా పోయిందని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ప్రధానమైన మహాలక్ష్మి స్కీమును ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ కార్మికుల భుజాల మీద వేసుకొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆర్టీసీ కార్మికుల వల్లనే ప్రభుత్వం ఏర్పడిందన్న ముఖ్యమంత్రి ఎందుకు వారిని రోడ్లమీద వేసి ఇబ్బందికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు మా బ్రాండ్ అంబాసిడర్ లు అన్న ముఖ్యమంత్రి వారి కార్మికుల సమస్యలపై ఎందుకు నోరు మీద పడడం లేదు తెలపాలని ప్రశ్నించారు. విపరీతంగా ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి కార్మికుల ఉద్యోగ భద్రతకే ముప్పు వాటిలిందని ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీలోని ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాల వల్ల కార్మిక సంఘాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం నేటి వరకు ఇచ్చిన హామీ మేరకు కార్మిక సంఘాల అనుమతిని ఎందుకు ఇవ్వడం లేదు తెలపాలని ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ రక్షణ కార్మికుల హక్కుల పరిరక్షణకై జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ప్రజా రవాణా ప్రజల కోసం ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి ప్రజా అవసరాలు తీరే విధంగా చొరవజేపాలని తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల కార్మికులకు తీవ్రమైన పని భారం పెరిగిన రోజుకు 60 లక్షల ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం మీద నుండి కోయిల పడ్డట్టు అయిందని వాపోయారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మె నివారణకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది. వెంకటేశ్వర్లు,ఎస్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు రవి, లక్ష్మయ్య టిఎంయూ డిపో కార్యదర్శి  లచ్చయ్య,, ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు సేవియా, టి జే ఎం యు డిపో కార్యదర్శి పీఎం రావు, ఐఎన్టీయూసీ డిపో కార్యదర్శి డి ఆర్ కుమార్, మీద యూనియన్ల నాయకులు శ్రీ కంఠం శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు ప్రవీణ్ సందేశ్, శ్రీధర్ గోవిందరాజు, రాజేశ్వరి ఎల్లమ్మ, సావిత్రి, శ్రీలత చైతన్య,రూపావతి, యాకమ్మ, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333