ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ల యందు MLHP వైద్య సిబ్బది ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలి :- డి యం హెచ్ ఓ డాక్టర్ SK సిద్దప్ప
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లాలో ఈ రోజు మొదలైన MLHP - ఇండక్షన్ ట్రైనింగ్ మరియు రివ్యూ మీటింగ్ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు... ఐ డి ఓ సి కార్యాలయం నందు ప్రారంభమైన ఇట్టి మీటింగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప , మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ జె సంధ్య కిరణమై , డాక్టర్ ప్రసూనారాణి, డాక్టర్ జి రాజు, డాక్టర్ రిజ్వానా తన్వీర్, హాజరయ్యారు... ఇట్టి మీటింగ్ నకు ఉద్దేశించి డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క MLHP సిబ్బంది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు సమయపాలన పాటించి... అన్ని ఆరోగ్య కార్యక్రమాలను చూసుకోవాలని.. మధ్యాహ్నం నుండి గ్రామాలకు వెళ్లి పర్యవేక్షణ చేయాలని తెలిపారు... ప్రతిరోజు జరిగే ఓపి ఆరోగ్య కార్యక్రమాలను, మరియు ఆరోగ్య శివిర్ యాక్టివిటీస్,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని... తెలిపారు
••• ఇట్టి రివ్యూ మీటింగ్ నకు, మెడికల్ ఆఫీసర్లు, 67 సెంటర్ ల MLHP సిబ్బంది, లేనిచోట సంబంధిత ANM లు, జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు...