ఆదివాసి గ్రామాలకు త్రాగునీరు అందించండి

Mar 11, 2025 - 19:32
Mar 11, 2025 - 19:49
 0  7
ఆదివాసి గ్రామాలకు త్రాగునీరు అందించండి

తేదీ:10-03-2025 చర్ల : మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు వేసవి దృశ్య ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తాగునీటిని సమృద్ధిగా అందించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ మంగళవారం స్థానిక మండల అభివృద్ధి అధికారి కె.ఈదయ్య కు వినతి పత్రం అందించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు మాట్లాడారు. మండు వేసవిలో మండల పరిధిలో ఉన్న వలస గ్రామాలతో సహా ప్రతి ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇప్పటికే మండలంలో చాలా చోట్ల తాగునీటి సమస్యలతో ఆదివాసీలు అల్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. వేసవికాలంలో తీసుకోవలసిన ప్రణాళికలు సంబంధిత అధికారులను సమన్వయ పరుచుకొని సత్వరమే తాగునీటి సమస్యల మీద నివేదికలు ఉన్నతాధికారులకు పంపాలని ఆయన కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో ప్రణాళికలు ఇప్పటికే రూపొందించామని , బోరు బావులు మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామని, మరొకమారు ఈరోజు జరిగే కార్యదర్శుల సమావేశంలో తాగునీటిపై చర్చ జరిపి ముందు ముందు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపడతానని ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పొడుపు గంటి సమ్మక్క, బందెల చంటి ,దొడ్డి హరినాగ వర్మ, కాంతయ్య నాయకులు సాంబ తదితరులు పాల్గొన్నారు.