ఆత్మ న్యూనత వీడాలి... ఆశయ సిద్ధికి అంకితం అవ్వాలి
పీపుల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల
విద్యార్థినిలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి
సూర్యపేట 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- విలువైన విద్యార్థి జీవితాన్ని ఆత్మ న్యూ నతకు బలిపెట్టవద్దని, ఆత్మ న్యూనతను విడనాడి అంకితభావంతో లక్ష్యసాధనకు కంకణబద్ధులు కావాలని సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి ఉద్బోధించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో వ్యవస్థాపకతపై రెండు రోజుల అవగాహన సదస్సు ను (ఎన్ ఐ ఈ ఎస్ బి యు డి) మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎండ్ ఎంటర్ప్రైన్షిప్ డెవలప్మెంట్ వారు పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా శిక్షణ ప్రోగ్రాం లో పాల్గొన్నటువంటి విద్యార్థినిలందరికి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డి.యస్పి జి. రవి హాజరై మాట్లాడుతూ ప్రతి యువత ఏదో ఒక నైపుణ్యంలో శిక్షణ పొందాలని, స్వయం ఉపాధి చేసుకోవాలని, అన్ని రకాల అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్లాలని, విద్యార్థులు ఈ లాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినిలు ఎవరికి ఎవరూ తీసిపోరని, ప్రతివారిలోనూ ప్రతిభ దాగి ఉంటుందన్న విషయాన్ని గమనించి తమ ప్రతిభకు తామే పదునుపెట్టుకొని ప్రతిభావంతులుగా మారి తాము ఏర్పరచుకున్న లక్ష్యాలను చేదించాలని సూచించారు. లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, లక్ష్యాలను సాధించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని, మాలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విషయం మరువరాదన్నారు. ఉద్యోగం సాధించడం వలన కొంత పరిధిలోనే సేవ చేయవచ్చని, ప్రభుత్వం కల్పించిన ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని, ఉపాధితో వందలాది మందికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలువ వచ్చని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ సునీల సుక్కి, నీస్ బర్డ్ ప్రాజెక్టు ప్రతినిధి ఎర్ర శివరాజు, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం నాయక్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, ఎస్ ఎన్ 9 అధినేత జర్నలిస్ట్ షేక్ పాషా, ఎల్ హెచ్ పి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్, టీ బీ ఎస్ ఎం రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాళ్ళ అశోక్ రావు, వైస్ ప్రిన్సిపల్ ప్రవల్లిక, బీసీ సంఘం నాయకులు వావిళ్ల రమేష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులకు డి.ఎస్.పి రవికుమార్, ఇతర ఆహ్వానితులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం అతిధులను ఘనంగా శాలువాలు, మేమేంటోలతో సత్కరించారు.