ఆజీంపేట గ్రామంలో సిసి రోడ్ నిర్మాణం..సర్పంచ్ కన్నబోయిన లింగస్వామి
అడ్డగూడూరు 29 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజింపేట గ్రామానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఈ.జి.ఎస్ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అజింపేట గ్రామ సర్పంచ్ కన్నెబోయిన లింగస్వామి ఉప సర్పంచ్ పోగుల మహేష్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు మెంబర్ కన్నెబోయిన మహేష్ 4వ వార్డు సభ్యులు కన్నెబోయిన సైదులు 5వ వార్డు సభ్యులు కన్నెబోయిన వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైలిక వెంకన్న & కన్నెబోయిన నర్సింహా బిఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన మల్లేష్,నేరటి రామస్వామి,గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.