ఆగస్టు 9 ఆదివాసి దినోత్సవం జయప్రదం చేయాలి
*ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి*
*న్యూ డెమోక్రసీ నేత ముసలి సతీష్.*
ఆగస్టు 8 చర్ల తెలంగాణ వార్త:-
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల అవుతున్న ఇంకా ఆదివాసులపై దాడులు, దోపిడీ జరుగుతూనే ఉన్నాయని చర్ల మండలం కలివేరులో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సధస్సులో ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం మండల నాయకుడు కారం సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కార్యదర్శి ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో ఆదివాసీలను అడవులనుండి గెంటి వేయడం కోసం ప్రయత్నాలు ప్రభుత్వాలు పాలకులు చేస్తున్నా రని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం ఆక్రమించుకోవడం అక్రమ కేసులు పెట్టడం ఆదివాసీలను వేధించడం నూతన ఆర్టీసీ సంరక్షణ నియమాలలో భాగమేనని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక చర్య నిరసిస్తూ ఈ నెల 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సదస్సులలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి ముత్తయ్య సీతమ్మ సమ్మక్క లక్ష్మి ఆదిలక్ష్మి వెంకటమ్మ సప్త నాగలక్ష్మి జ్యోతి కౌసల్య తదితరులు పాల్గొన్నారు