ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలి

Aug 8, 2024 - 22:35
 0  0
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలి

ఆగస్టు9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలని...

ఆదివాసి ఐక్యవేదిక 

ఆగస్టు 8 వెంకటాపురం తెలంగాణ వార్త:-

ఆధ్వర్యంలో ఆగస్టు9 సెలవు ప్రకటించాలనీ ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ నేటి కూడా సెలవు ప్రకటించలేకపోవడం ప్రభుత్వం ఒక్క సిగ్గు సేటు అని అన్నారు,ఆదివాసి ఎమ్మెల్యేలు ఐదుగురు ఉండి కూడా నిమ్మకు నీ నెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఆదివాసి ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. గురువారం నాడు వెంకటాపురం విశ్రాంతి భవనం ఆవరణంలో ఆదివాసి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పూనేం సాయి దొర మాట్లాడుతూ. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు.స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికి ఆదివాసి స్వేచ్ఛ లేదని కనీసం ఆగస్టు9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సెలవు దినం ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు,ఏజెన్సీ ప్రాంతంలో కొమరం భీమ్ తెచ్చిన చట్టా లు జీవోలపైనే అసెంబ్లీలో ఆదివాసి ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టి ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు సెలవు దినంగా అధికారకంగా ప్రకటించకపోవడం ఏమిటని అన్నారు,ఒకప్పుడు సమ్మక్క సారక్క,కొమరం భీమ్,గండం మల్లు దొర,ఈ పోరాట ఫలితంగా ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండి కూడా ఆగస్టు 9 కొమరం భీమ్ సెలవు దినంగా ప్రకటించలేకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు,రాజకీయ పార్టీల కాళ్ల కిందనే ఆదివాసి ఎమ్మెల్యేలు బానిసలుగా బ్రతుకుతున్నారని ఆయన మండిపడ్డారు.ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ పార్టీ ఆదివాసి ఎమ్మెల్యేలు ఇంతవరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం 9న సెలవు దినంగా ప్రకటించాలని ఏ ఒక్క ఆదివాసి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు.1994 90 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఆదివాసీలు భూమిని నీటిని అడవిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని అలాంటప్పుడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని సెలవు దినంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి చెపుతున్నప్పటికీ ఈ నీచమైన రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆగస్టు 9 వెంటనే ప్రపంచ ఆదివాసి దినోత్సవం సెలవు దినంగా ప్రకటించకపోతే ఆదివాసి ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమం పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు.ఈ ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పరిషత్ సతీష్,ఆదివాసి నాయకులు కనితి వెంకటకృష్ణ,పాయం కిరణ్,తాటి లక్ష్మణ్, వాసం నారాయణ తదిరులు పాల్గొన్నారు.