అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు జిల్లా కలెక్టర్

తిరుమలగిరి 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి.....
ధాన్యం వేగంగా తరలించాలి.....
ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం తిరుమలగిరి మండలం కొక్యతండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను 600 చదరపు అడుగులలో మాత్రమే నిర్మించుకుంటేనే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంకు అర్హులు అవుతారని తెలిపారు. ఇస్లావత్ యాకమ్మ, ఇస్లావత్ జగన్ లు నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొక్యాతండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని లోడ్లు వెళ్లినాయి ఇంకా ఎన్ని లారీలు అవసరం ఉంటాయి అని నిర్వాహకులని అడగగా ప్రతి రోజు 3 లారీల లోడ్లు పంపుతున్నామని ఇప్పటి వరకు 34 లోడ్ల ద్వారా మొత్తం 11,064 క్వింటాల ధాన్యంమిల్లులకి తరలించామని తెలిపారు.ఈరోజు నుండి అదనంగా 3 లారీలను పంపిస్తామని ప్రతి రోజు 6 లారీలు ధాన్యం లోడ్ చేసి మిల్లులకి తరలించాలని కలెక్టర్ నిర్వహకులకి ఆదేశించారు. తదుపరి తిరుమలగిరి మార్కెట్ యార్డ్ పరిశీలించి ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని త్వరగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్డివో వేణుమాధవ్,సివిల్ సప్లై డి యం ప్రసాద్, ఎంపిడిఓ ప్రసాద్, ఏపీఎం మధు, ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి కిరణ్, సెంటర్ ఇంచార్జి సురేందర్,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.