అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

హాజరై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ నరసింహ.

Mar 31, 2026 - 20:21
Mar 31, 2026 - 20:27
 0  1
అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం.

మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు తప్పవు.

మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దు.

ప్రయాణికులను సురక్షిత గమ్యం చేర్చడం డ్రైవర్ బాధ్యత.

కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

 
సూర్యాపేట, 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం కొత్త బస్టాండ్ నుండి కుడకుడ వెళ్లి రోడ్డు నందు స్థానిక ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రహదారి నియమాలు పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలని, డ్రైవర్ బాధ్యతగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని అన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెల్లు వారిని గమనిస్తూ  ముందుకు సాగాలని సూచించారు.  టాక్సీ, ఆటో డ్రైవర్లు చక్కని యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టి రవాణా చేయకూడదని తెలిపారు.  డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేయలేక ప్రమాదాల బారిన పడతారని సూచించారు. 

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జైలుకు పంపడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది, ఏప్రిల్ 1వ తేదీ నుండి నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకు పంపడం జరుగుతుందని అన్నారు, వాహనం నడుపుతున్న వ్యక్తికి జైలు శిక్ష జరిమానాలు తప్పవని హెచ్చరించారు. సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టవద్దని సూచించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ తప్పకుండా ధరించాలని కోరారు. కార్లు పెద్ద వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం సురక్షితం, నిదానంగా వాహనాలను నడుపుతూ ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరాలని సంతోషంగా జీవించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం నందు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐ లు ఏడుకొండలు, ఐలయ్య,  స్థానిక పౌరులు ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333