జిఎం సీతారాం నాయక్ ను సన్మానించిన ఎఐబిఎస్ఎస్ నాయకులు

Mar 31, 2026 - 20:18
Mar 31, 2026 - 20:25
 0  1
జిఎం సీతారాం నాయక్ ను సన్మానించిన ఎఐబిఎస్ఎస్ నాయకులు

సూర్యాపేట కలెక్టరేట్, 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గా విధులు పొందుతూ ఉద్యోగ విరమణ పొందిన తేజావత్ జయసీతారాం నాయక్ ను ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సీతారాం నాయక్ ఉన్నత చదువులు చదివి 1989లో ఉద్యోగంలో చేరినట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ హోదాలో ఎన్నో ఉత్తతమైన సేవలు అందించారని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవలో భాగస్వామి కావాలన్నారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఐఇఓ భాను నాయక్, ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లూనావత్ పాండు నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ వీరన్న నాయక్, జిల్లా అధ్యక్షులు గుగులోతు నాగు నాయక్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వివి నాయక్, ఎపిఎం నర్సింహా నాయక్, ఎఐబిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు బాబు నాయక్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డీనేటర్ గుగులోతు వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333