అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం

తిరుమలగిరి 27 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల కేంద్రంలోని వినాయకుడి దేవాలయంలో గురువారం గురు స్వాములు అఖిలభారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బేతోజు భాస్కరాచారి, గురుస్వాములు కంచర్ల శేఖర్, శివకోటి నవీన్ ఆలయ అర్చకులు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఇరుముడి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వాముల శరణు ఘోషలు, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.అయ్యప్ప మాలదారులు, బంధువులతో పండుగ వాతావరణం నెలకొంది.అయ్యప్ప స్వాములు 41 రోజులపాటు దీక్ష చేసి గురుస్వాముల ఆధ్వర్యంలో 15 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టించుకుని శబరిమలై జ్యోతి దర్శనానికి బయలుదేరారు.ఇదే క్రమంలో భాగంగా నవతెలంగాణ రిపోర్టర్ నెల్లుట్ల రాజు (కత్తి స్వామి) కూతురు నెల్లుట్ల జశశ్విని పుట్టినరోజు సందర్భంగా కుమారి జశశ్విని ని అయ్యప్ప స్వాములు నిండుగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు బెల్లంకొండ నరేష్,గద స్వాములు గిలకత్తుల నాగరాజు, బౌరోజు వేణు, గంట స్వాములు వేల్పుల రమేష్,రాకేష్, కన్నె స్వాములు వల్లపు సందీప్, చౌగోని మురళి, బౌరోజు యశ్వంత్, కందుకూరి శివ, యనగందుల వంశీ, మరియు సివిల్ స్వాములు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.