అమరవీరుల. త్యాగ ఫలితమే దేశానికి స్వతంత్రం
అమరవీరుల త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్రం
సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
అమరవీరుల త్యాగ ఫలితం దేశానికి స్వతంత్రం వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మ బిక్షం భవన్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను బెజవాడ వెంకటేశ్వర్లు, పార్టీ జెండాను దంతాల రాంబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఎనిమిది శతాబ్దాలకు చేరువవుతున్న ప్రజాస్వామ్య పాలనలో నేడు అభివృద్ధి జరిగిందనే మాట ఏ మేరకు నిజమో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అంతే వాస్తవం అని ఆయన అన్నారు. కేంద్ర పాలకులు భారత రాజ్యాంగం మార్చే కుట్రకు పాల్పడుతున్నారని, భారత రాజ్యాంగాన్ని లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
దేశ ఐక్యతకు భంగం కలిగించే విధంగా దేశంలో మతోన్మాద శక్తులు అనేక కుట్రలు చేస్తున్నారని వాటిని ప్రజలందరూ చైతన్యంతో తిప్పికొట్టాలని కోరారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతల మల్లేశ్వరి, ఏ టు సి ప్రాంతీయ అధ్యక్షులు దంతాల రాంబాబు, బొమ్మగాని శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, నీలా శ్రీనివాస్ గోపగాని రవి, ఎడెల్లి శ్రీకాంత్, బూర సైదులు, దీకొండ శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి, హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ అధ్యక్షుడు బాబా, పెండ్ర కృష్ణ, వాడపల్లి వెంకన్న, వాడపల్లి గోపి, తాళ్ల సైదులు, హరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.