అబ్బో పొగ
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్. పట్టణం: నోబెల్ స్కూల్ పరిసర ప్రాంతంలో పట్టణంలో సేకరించిన చెత్తనంతా ఇక్కడే డంప్ చేస్తూ ఉంటారు. అలా డంప్ చేసిన చెత్తను నిప్పు అంటించడంతో అందులో ముఖ్యంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్ధాలు అంటుకొని నల్లని పొగ వ్యాపించి పట్టణ పరిసరాలలో వివిధ రకాల రోగాలు రావడానికి ఆస్కారం ఉందని, పొద్దున్నే ఇలాంటి పొగ పీల్చడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ ప్రాంత వాసుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి గద్వాల్ మున్సిపల్ అధికారులు చెత్తకు నిప్పు పెట్టకుండా ఇతర రీసైకిలింగ్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ఇటు పర్యావరణాన్ని అటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలరని గద్వాల పట్టణ ప్రజలు మనవి చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటివి పురాణావృతంకాకుండాని కాలనీవాసులు కోరుతున్నారు.