అప్పు కట్టలేదని ఇంటికి చెప్పులు,పొరక, చేట తో తోరణం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ :-ఆత్మకూర్ ఎస్ సూర్యాపేట. అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న మహిళ ఇంటికి చెప్పులు, పొరక, పాత చేటలతో తోరణం ఏర్పాటు చేసి గ్రామంలో చాటుకు చేయించిన ఘటన మండల పరిధిలోని అశ్లా తండాలో చోటు చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని మహిళ ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసలా తండాకు చెందిన వాంకుడోత్ కీమా, అనిత భార్యాభర్తలు. కీమా మూడు సంవత్సరాలకు ముందు అదే తండాకు చెందిన ధరావత్ రంజా వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది కాలానికి అనారోగ్యంతో కీమా మృతిచెందాడు. దీంతో అనిత బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లి బతుకుతున్నది. తమ డబ్బులు ఇవ్వాలని రంజా అనితను కోరుతున్న ఇవ్వకపోవడంతో ఇటీవల రంజా కుటుంబ సభ్యులు అనిత ఇంటికి పాత చెప్పులు పోరాక పాత చాటలను దండగ కూర్చి తోరణంగా కట్టారు అనంతరం అనిత తమ అప్పు చెల్లించడం లేదని గ్రామంలో ఎవరు తనకు అప్పు ఇవ్వవద్దని డప్పు చాటింపు చేయించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు హైదరాబాదులో ఉన్న అనితకు సమాచారం ఇవ్వగా ఆమె శనివారం స్థానిక పోలీసులను ఆశ్రయించినది. తన ఇంటికి చెప్పుల దండలు వేసి ఊర్లో డబ్బు చాటింగ్ చేయడంతో తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని భర్త చనిపోవడంతో బతుకుతెరువు కోసం హైదరాబాదు వెళ్లి బతుకుతున్నారని కావాలని నాపై దృష్టి ప్రచారం చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజాన్ తో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రత్నావత్ శంకర్ నాయక్ తెలిపారు.