అన్నె పర్తి జ్ఞాన సుందర్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

Oct 18, 2024 - 21:47
Oct 19, 2024 - 10:05
 0  127
అన్నె పర్తి జ్ఞాన సుందర్  పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఇటీవల కాంగ్రెస్ నాయకులు అన్నెపర్తి జ్ఞానసుందర్ అధికార ప్రతినిధి తెలంగాణ కాంగ్రెస్ కమిటి పై MRPS నాయకులు చేసిన ఆరోపణలు ఖoడిసున్నాం.

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిది..

జ్ఞానసుందర్ మాల కులం వాది అని ఆయన రాజకీయజీవితం మాదిగల చేతుల్లో అంతం చేస్తామని ప్రకటించడం చాల విచారకరం.

జ్ఞాన సుందర్ అన్నా పుట్టుకకు మాల కులం అయిన జీవితంలో మాదిగ కులం వారి చైతన్యం కొరకు సమాజ చైతన్యం కొరకు పనిచేశాడు.

కులం కావాలా? కుటుంభం కావాలా అంటే సమాజం కావాలంటాడు. సమాజ సేవకునికి కులం అంటగట్టడం అర్థ రహితం. 

మందకృష్ష అన్నా ఖమ్మం జిల్లా మధిరలో మాధిగలు ఎక్కవ ఉన్నారని, మాధిగలను నమ్మి ఎమ్మల్యే గా పోటిచేస్తే మాదిగలు ఓటువేయలేదు అందువలన డిపాజిట్ రాలేదు. మందకృష్ణ అన్న కు డిపాజిట్ కూడ దక్కించుకో లేని మీరు మరోకరి రాజకీయ జీవితం అంతం చేస్తావా?

జ్ఞానసుందర్ అన్నా సమాజం కొరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు. కులమతాలకు అతీతంగా ఎంతోమందికి విద్యను అందించాడు. నాయకులుగా ఉపన్యాసకలుగా తర్ఫీదు ఇచ్చాడు. మాదిగలు చెప్పే జనాభా లెక్కలు, మాలలు చెప్పె జనాభా లెక్కలు తప్పు అంటుంన్నాడు జ్ఞానసుందర్ అన్నా. శాస్త్రీయ పద్దతుల్లో జనాబ లెక్కలు తీసి ఏ ఒక్క కులానికి అన్యాయం జరుగకుండా వర్గీకరణ చేయాలనేది జ్ఞానసుందరన్న డిమాండ్.

బిజెపి దేశవ్యాప్తంగా మాల మాధిగలపై, క్రిష్టియన్స్ పై ముస్లీమ్స్ పై దాడులు చేస్తుంటే ఆ పార్టికి ఓటువేయమని చెప్పడం భాదాకరం.

బిజెపి మనుధర్మాన్ని, సనాతనా ధర్మాన్ని పాటిస్థుంది. మాల మాధిగలు ఉపకులాలు చదువుకో వద్దు, గుడికి రావొద్దు రాజ్యపాలన చేయవద్దు భానిసలుగా సేవలందించాలనేది మను సిద్దాంత ధర్మం. కృష్ణ మాదిగ బిజెపిని బలపర్చడమంటే ఎస్సి, బిసిలను క్రిష్టియన్స్, మస్లీమ్స్ ను బానిసలుగా జీవించాలని అంగీకరిస్తున్నట్టే.

జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి హక్కులను రద్దు చేయడానికీ పార్లమెంటులోబిల్లు పెట్టి 370 ఆర్టికల్ ను రద్దుచేశారు.

షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు వర్గీకరించడానికి పార్లమెంటులో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ ను సవరిస్తే రాష్ట్రాలు నోరుమూసుకుని ఆలస్యం లేకుండా అమలు చేస్తుండే కదా! 

ప్రధాని మోదీ ద్వందవైకరితో కపట ప్రేమను మాదిగల పై వ్యక్తం చేశాడు. మోడీ వైఖరి ని తీవ్రంగా కండిస్తున్నాను.

మంద కృష్ణ గారేమో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టి నేతలను మల్లిఖార్జున ఖర్గే గారిని శ్రీమతి సోనియా గాంది గారిని,గౌరవ రాహుల్ గాంధిల పై విమర్శలు చేయడం సహేతుకం కాదు.

నిరుద్యోగులు ఓ వైపు ఉద్యోగాలు నింపమని ధర్నాలు, కృష్ణ మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిన తర్వాత ఉద్యోగాలు నింపమంటారు. మాలలేమో జనాభలెక్కలు తేలేంత వరకు వర్గీకరణ చేయవద్దాంటారు. అసలు వర్గీకరణ వద్దాంటారు. ప్రభుత్వం ఎవరి మాట వినాలి? కృష్ణ మాదిగ అన్నా గారు మీరు బిజెపి కి ఓట్లు వేయమంటిరి ఇపుడేమో కేంద్రం లో అధికారం లేని కాంగ్రెస్ ను నిందింఛడం ధర్మం కాదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అద్యనం తర్వాత తప్పులు లేకుండా వర్గీకరణ చేస్తుంది. భారత పౌరుడిగా కాంగ్రెస్ పార్టి నారకుడిగా చెబుతున్నా బిజెపి చెలిమి వదిలి వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఉద్యమానికి నా మద్దతు తెలియజేస్తు న్నాను

SS సాజిత్ 

సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట జిల్లా.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223