చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలి

Aug 7, 2024 - 20:37
 0  8
చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలి

*ఏజెన్సీ మండలాలపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదని:*

*న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్* 

ఆగస్టు 7 చర్ల తెలంగాణ వార్త:-

 చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తాగడానికి మంచినీటి సౌకర్యం లేకపోవడంతో డాక్టర్స్ సిబ్బంది మరియు ఆసుపత్రికి వచ్చిన రోగులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో గొంతు తడిపేటందుకు నీరు లేకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి మండల అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చర్ల మండలంలోని ఆదివాసి ప్రజలు ఇంటి దగ్గర నుంచే భోజనం తీసుకొని వస్తారు ఇక్కడ ఆసుపత్రికి వచ్చాక నీరు లేకపోవడంతో వారు వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని వెనక్కి తీసుకు వెళుతున్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి 500 పైబడి పేషెంట్లు వస్తున్నారు తాగడానికి మంచినీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తక్షణమే మండల అధికారులు స్పందించి వాటర్ ప్యూర్ ఫైర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అయన డిమాండ్ చేశారు.ప్రజలు హాస్పటల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్న ఈ అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదనీ వారి ప్రశ్నించారు.జ్వరంతో వచ్చి ఒళ్ళు తుడుచుకోవడానికి ఇక్కడ నీటి సౌకర్యం లేదు.తక్షణమే చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజా ఉద్యమాలు కొనసాగించాల్సి వస్తుంది అని అయన అన్నారు స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్న ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు చర్ల మండలం లో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజలు మలేరియా,టైఫాయిడ్ డెంగ్యూ ఒళ్ళు నొప్పులు కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెక్కాడితేనే డొక్కాడే పేద ప్రజలు ఎక్కువ శాతం చర్ల మండలంలో ఉన్నారు.తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలు కల్పించాలని అలాగే మందులు,స్కానింగ్ లు,టెస్టులు అవకాశాన్ని కల్పించాలని వారు కోరారు లేనిచో దశల వారి ఆందోళనలు చేయవలసిందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గా పిలుపునిస్తున్నాం.