అనాదిగా కొనసాగిన ఆచారాన్ని ప్రశ్నిస్తే నేరం ఎలా అవుతుంది?

Oct 15, 2026 - 00:31
 0  0

అనాదిగా కొనసాగిన ఆచారాన్ని ప్రశ్నిస్తే నేరం ఎలా అవుతుంది?

అవసరం, ఆలోచన  నుండే  శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినది వాస్తవం కాదా ?

మార్పు కోరకుండా ఉండడమే  పాలకులు చట్టాలకు అంగీకారమా? ( రావణ వధ)

----  వడ్డేపల్లి మల్లేశం

సృష్టి ఆవిర్భావము నుండి  క్రమానుగతంగా సమాజం విభిన్న రకాల  పరిస్థితులు ఒత్తిళ్ల కారణంగా  మారుతూ  శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క ఆవశ్యకత  చొరవ  ప్రజల యొక్క ఆసక్తి అన్వేషణ కారణంగా   పరిణామం చెందుతూ ఉన్నది. ప్రస్తుతం ఉన్న  రూపం సారం మాత్రమే  ముగింపు దశ కావడానికి వీల్లేదు ఎందుకంటే  ఆలోచనలు, అవసరాలు,  ప్రయోగాలు, పరిశోధనలు  కొనసాగినంత కాలం  మార్పు అనివార్యం అందుకే సమాజము చలనశీలమైనది అని  శాస్త్రవేత్తలు సామాజికవేత్తలు పరిశోధకులు రచయితలు నొక్కి చెప్తున్నారు.  ప్రజల యొక్క ఆసక్తులను కూడా ఈ వైపు  పెంపొందించవలసినది పోయి మార్పు అనివార్యం అని చెప్పకుండా  ఇంతటితో ముగిసిపోయినట్లే, ప్రస్తుతము కొనసాగుతున్నది గతంలో కొనసాగినది  వాస్తవం, ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది నిర్ణయించబడ్డది అనే రీతిలో  సాంప్రదాయాలు ఆచారాలు నేడు మన వ్యవస్థను  శాసిస్తున్న తీరు మనకు తెలుసు.

మహిళల దళితుల పైన విభిన్న  వర్గాలు వెనుకబడిన ఆదివాసీల పైన  శతాబ్దాలుగా కొనసాగినటువంటి వివక్షత  అణచివేత  నేడు చాలా వరకు తగ్గిన విషయం వాస్తవం కాదా? దానికి కారణాలు ఏమిటి?  శాస్త్రవేత్తల పరిశోధనలు సామాజికవేత్తల  నూతన చింతన  ప్రజల యొక్క పోరాట పటిమ కలిసి  ఉనికి కోసం పోరాటం అనే క్రమంలో  ఎక్కడికి అక్కడ జరుగుతున్నటువంటి  విప్లవాలవల్లనే నే కదా ఈ మార్పు అనివార్యమైనది.  గడప దాటనటువంటి వాళ్లే స్త్రీలు అనే నిర్వచనం ఇచ్చుకున్న సందర్భం నుండి నేడు అన్ని రంగాలలో స్త్రీలు  దూసుకు వెళ్తున్నారంటే  గీత గీసిన పరిమితిని దాటడం వల్లనే కదా!  ఈ రకంగా సామాజిక కట్టుబాట్లు అణచివేత సాంప్రదాయాల ముసుగులో  సమాజంలోని కొన్ని వర్గాలను అనాదిగా ఉంచడం ఆనవాయితీగా మారిన నేపథ్యంలోనే  కొన్ని వర్గాల ఆగడాలకు అంతులేకుండా పోయింది.  అక్షరాస్యత పెరుగుదల, విద్యా కార్యక్రమాలు,  చైతన్య కార్యక్రమాలు,  కాలానుగుణంగా  అవసరాలు భారీగా పెరగడంతో నూతన పరికల్పనల క్రమంలోనేటి వికాసం సాధ్యమైనది అని అంగీకరించి తీరాలి."  తను తె గకుండా కత్తి తెగదు" అనే సిద్ధాంతం ప్రకారం  మార్పు కోరకుండా ఆ వైపు పయనించకుండా  అవసరమైతే పోరాటం చేయకుండా  నూతనత్వాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది కదా! కొంతకాలం  ప్రజా జీవితంలో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు లేదా విశ్వాసాలు కొనసాగినంత మాత్రాన  వాటికి చట్టబద్ధత  విశ్వసనీయత ఉందని  విశ్వ జనీ నమైన అంశాలుగా భావించడానికి వీలు లేదు.  అణచివేతకు గురైన వాళ్ళు పోరాడే తమ హక్కులను సాధించుకున్నప్పుడు  ఆ వర్గాలలో మార్పు వస్తుంది కదా అది ఎలా సాధ్యమైంది? కేవలం ప్రశ్నించడం వల్లనే--  అందుకే సమాజంలో కొన్ని వర్గాలకు  వ్యతిరేకంగా కొనసాగుతున్న విష ప్రచారాలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం  ప్రతిఘటించడం వల్ల మాత్రమే ఆయా వర్గాలకు భవిష్యత్తులో ఉనికి  సాధ్యమవుతుంది.  అయితే మెజారిటీ వర్గాలు ఎప్పుడూ కూడా మెజార్టీ పక్షానికి మద్దతు ఇవ్వవచ్చు కానీ మైనారిటీ వర్గాల యొక్క ఆలోచన కూడా  వాస్తవమే అని కొద్ది మంది అయినా విశ్వసించినప్పుడు  కొత్త సిద్ధాంతం, అవగాహన, పోరాటం ఆవిష్కృతం అవుతుంది.  పౌరాణిక ఇతిహాసానికి సంబంధించినటువంటి రామాయణ చరితం  రామ రావణ యుద్ధం  కల్పిత గాధ అని కొందరు చారిత్రక సంఘటనఅని మరికొందరు  ఎవరి వాదన వారు  నెట్టుకొస్తున్నప్పటికీ  శ్రీరాముడిని చారిత్రక  ప్రముఖుడిగా కొందరు గుర్తించినప్పటికీ  అంతే స్థాయిలో  రావణాసురుడు ని కూడా కొందరు  చారిత్రక వ్యక్తిగా గుర్తింపు  తేవడం కోసం "రావణ వధను అడ్డుకోవడం ద్వారా" విశ్వ ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఇటీవల  మనం కొంతవరకు గమనించవచ్చు.  మైనారిటీగా నైనా    దసరా పండుగ రోజున జరుగుతున్న రావనవధ కార్యక్రమాన్ని  పర్యావరణానికి విద్రోహం తలపెట్టే రీతిలో జరపడాన్ని ప్రశ్నించడం ఇటీవల కాలంలో వచ్చిన ఆధునిక  పోకడగా గుర్తించాల్సివుంది.

భిన్నాభిప్రాయాలను గౌరవించడమే సంస్కృతి

దసరా పండుగ రోజున  రావణాసురుడి పది తలల విగ్రహాన్ని భారీగా  రూపొందించి   చెడుకు ప్రతినిధిగా  విష ప్రచారం చేసి  చెడుపై   విజయంగా దసరాను  గుర్తించాలనే నెపంతో కొందరు  రాముని తత్వాన్ని  అంగీకరించిన వాళ్లు అనాదిగా బాంబులతో పేల్చి  రావణాసురుడిని చంపినట్లు అక్కసు వెళ్ళగక్కి  ఏదో ఉద్ధరించినట్టుగా సంతోషపడుతున్నారు.  అయితే ఈ సంఘటనలు ఈ కార్యక్రమాల వెనుక రెండు అంశాలను ప్రధానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది.  ఒకటి విశ్వాసానికి సంబంధించిన అంశం అయితే  రెండవది   పర్యావరణానికి  విద్రోహం తలపెట్టే చర్యగా గుర్తించినప్పుడు మాత్రమే  ప్రకృతికి కొంతవరకు మేలు జరుగుతుంది.   కొంతమంది మనోభావాలు దెబ్బ తినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.

రాముడు ఏకపత్నివతుడని,  తండ్రి మాట జవదాటని వాడని,  ప్రజల ప్రచారాన్ని  తట్టుకోలేక  తన భార్య సీతను అడవికి పంపించినాడని  సీతను రావణుడు అపహారించినందుననే అవమానానికి ప్రతిగా రావనవద అనివార్యమైనదని ఒకవైపు వాదన కొనసాగుతూ ఉంటే  ఇదంతా కావాలని రావనాషురుడిపై బురద చళ్ళుతున్నారని ప్రతి విమర్శ ఈ మధ్య బలం పుంజుకున్నది.ప్రచారాన్ని చరిత్రగా  వాస్తవంగా చూడడానికి వీల్లేదని  తనకంటే బలవంతుడు అయినటువంటి రావణాసురుడిని  అంతం చేయడమే రాముని యొక్క లక్ష్యం అని  ఆ క్రమంలోనే హత్య చేసి  దానికి ప్రతిగా  పెద్ద ఎత్తున ప్రచారం జరుపుకోవడం అంటే  దసరా రోజున  ప్రజల సమక్షంలో రావణ వద్ద నిర్వహించడం అంటే  ఎందరో ప్రజల మనోభావాలను  కొల్లగొట్టడమే అని మరొక వర్గం తీవ్రంగా వాదిస్తున్నది. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలను  తమ వాదన పటిమ ద్వారా తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తున్న ఈ కాలంలో  చరిత్ర కందని రోజుల్లోని ఒక  పౌరాణిక కథ  ఆధారంగా రాముడు దేవుడని రావణుడు రాక్షసుడని  రాక్షసున్ని సంహరించడమే నేడు మనందరి యొక్క లక్ష్యం అని  మెజారిటీ  సాంప్రదాయ  ఆచార  విశ్వాసం వ్యక్తం చేస్తున్న వ్యక్తులు విద్యావంతులు, బుద్దిజీవులతో సహా అంతా  దీనిని చట్టబద్ధంగా అమలు చేస్తూ ఉంటే పాలకులు   గుడ్లప్పగించి చూస్తున్నారు అన్నప్పుడు  రావణుని పక్షంగా ఆలోచించే అభిప్రాయం కలవాళ్ళు కూడా ఉంటారనే సోయి  బాధ్యత లేకపోవడం విడ్డూరం విచారకరం. ఇతరుల అభిప్రాయాలతో మనం ఏకీభవించవలసిన అవసరం లేకపోవచ్చు కానీ  ఇతరులకు కూడా తమకంటూ ఒక అభిప్రాయం ఉంటుందని ఆ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉంటుందనే  చారిత్రక దృక్పథం నుండి  స్వార్థం కోసం వైదొలగడం అంటే  గుడ్డి నమ్మకాన్ని సమాజం మీద రుద్ది  అశాస్త్రీయమైనటువంటి విషయాలను చట్టబద్ధం చేయడానికే నని  రుజువవుతున్నది. దీనికి  పాలకపక్షాలు పోలీసు వ్యవస్థ  మద్దతు ఇవ్వడం  అంటే ఈ బాంబు ల మోత ద్వారా  కొద్దిమంది  ప్రజలను  వేధింపులకు గురి చేయడం, అవమానపరచడం, అభిప్రాయాల కొల్లగొట్టడమే.

ఇలాంటి మతపరమైన విషయాలకు వచ్చినప్పుడు బిజెపి లాంటి పార్టీలకు  ఇందులో ప్రధాన పాత్ర ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ బీజేపీకి అతీతంగా  ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు   పాలకులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా  మౌనంగా ఉండడం,  కొద్దిమంది చేసే ఈ  దుందుడుకుతనాన్ని వ్యతిరేకించకపోవడం  అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తానులోని ముక్కలని  మెజారిటీ ప్రజల అభిప్రాయానికే కానీ మైనారిటీల  అభిప్రాయాలను కూడా గౌరవించాలనే స్పృహ లేకపోవడం విచారకరం.  ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటి ఈ స్పృహ  ఒక సామాజిక చింతన  బలపడుతుంది.  చట్టం మద్దతు  అధికార యంత్రాంగం అండ  ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల విశ్వాసాలను  కొల్లగొట్టే అధికారం ఏ పాలకులకు ఉండదని తెలుసుకోవడం మంచిది.  ఆ రకంగానై నా  భిన్న వర్గాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను గౌరవిద్దాం. రాముని మాదిరిగానే రావణుడు కూడా  ఒక చారిత్రక పురుషుడు అని  నినదీస్తున్న వారికి  సమాజంలో చోటు కల్పించే చర్చకుచర్యలకు అవకాశం ఇద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333