అధిక ధరలతో ప్రజలపై పెరుగుతున్న భారం 

Aug 19, 2026 - 20:00
 0  0
అధిక ధరలతో ప్రజలపై పెరుగుతున్న భారం 

 ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి:
 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూర్యాపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగానిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనె, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఒకవైపు ఆదాయాలు పెరగకపోగా మరోవైపు ధరలు పెరగడంతో కుటుంబ అవసరాలను తీర్చుకోవడం ప్రజలకు కష్టంగా మారిందన్నారు. ధరల పెరుగుదల ప్రభావంతో పేద కుటుంబాలు తమ పిల్లల విద్య, వైద్యం, పోషకాహారం వంటి అవసరాలపై కూడా ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కూలీలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చిరుద్యోగులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని నిత్యావసరాలకే ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరిగి, దాని భారం కూడా చివరకు సామాన్య వినియోగదారులపైనే పడుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపే విధానాలను విడనాడి ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కాకుండా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి సమస్యలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి విస్తృత ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సూచించారు.  నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలి హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల వరి పంటను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో సాగవుతున్న లక్షలాది ఎకరాల వరి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వరి పంటకు కీలకమైన దశలో నీటి అవసరం తీవ్రంగా ఉంది. కాలువలకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అవసరమైన నీటిని విడుదల చేయడంతో పాటు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు చేపట్టాలి. హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల వరి పంటను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను ఆదుకోవాలి.  అఖిలభారత రైతు సంఘం 36వమహాసభలను జయప్రదం చేయాలి.  నవంబర్ 15 నుండి18 వరకు పోరాటాల పురిటి గడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల విజయవంతం కై పార్టీ ప్రజాసంఘాల సేణులు ఇంటింటికి వెళ్లి రైతు మహాసభల విజయవంతానికి నిధులు సమీకరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి మహాసభల ప్రాధాన్యతను వివరించాలన్నారు. నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాది మంది రైతాంగాన్ని సమీకరించాలన్నారు. ఈ బహిరంగ సభకు ఇంటికొక మనిషి ఊరుకోక బండి తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు రాపోలు సూర్యనారాయణ ఆవిష్కరించారు.సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెల్లిసైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి 
, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండల, పట్టణ కార్యదర్శులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333