అధికారు లు లేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్

Jun 2, 2026 - 19:41
 0  1
అధికారు లు లేని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్

జోగులాంబ గద్వాల 2 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యాడ్ కమిటీలో అధికారులు లేక కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ ఉన్న అధికారులు వనపర్తి కి ఏడి మార్కెటింగ్ శాఖ అధికారి పుస్పావతమ్మ. మార్కెట్ సెక్రటరీ నరసింహులు మహబూబ్నగర్ కి బదిలీ కావడంతో ఇక్కడ అధికారుల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సూపర్వైజర్లు ముగ్గురు ఉండాల్సింది ఉండగా. ఒకరు లీవ్ లో ఉన్నట్లు ఒక పోస్టు ఖాళీగా ఉన్నదని ప్రస్తుతం ఒక్కరు మాత్రమే సూపర్వైజర్ గా కొనసాగుతున్నారు. మార్కెట్ యార్డ్ లో నిత్యం కొనుగోలు అమ్మకాలు వ్యాపారా లు ట్రేడర్స్ ద్వారా నిత్యం కొనసాగుతాయి. అధికారులు లేకపోవడంతో రైతులకు వ్యాపారస్తులకు సమస్యగా మారిందని కమిషన్ ఏజెంట్లు ఆవేదన వ్యక్తపరిచారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు నాలుగు చెక్పోస్టులు ఉన్న అనుకున్నంత ఆదాయము రాకపోవడం అధికారులు పనితీరు లేకపోవడం తదితర కారణాలవల్ల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నో చుకోలేదని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోనూ మార్కెట్ యార్డులో సిబ్బంది కొరత వలన రైతులకు న్యాయం జరగకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చొరవ తీసుకొని జాతీయ మార్కెట్ యార్డ్ కు వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని రైతులు స్థానికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333