అడ్డగూడూరు మండల కేంద్రానికి ఎమ్మెల్యే రాక..

అడ్డగూడూరు22 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ అడ్డగూడూరు మండల కేంద్రానికి సోమవారం ఉదయం10:00 గంటలకు ఎంపీడీవో కార్యాలయం నందు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ విచ్చేసి.. ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.తప్పక అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని గ్రామశాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,యువజన నాయకులు,మహిళా నాయకురాలు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని
మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ తెలిపారు.