అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

అడ్డగూడూరు 27 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణ రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరనిలోటని అడ్డగూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులందరూ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వళ్లంభట్ల రవీందర్ రావు, మాజీ ఎంపీటీసీ గూడేపు పాండు, బొమ్మగాని లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కడారి రమేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, టిపిసిసి నాయకులు గూడేపు నాగరాజు, ఆసర్ల మచ్ఛగిరి, గూడేపు బాబు, పొన్నాల వెంకన్న యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు పూలపల్లి రాజశేఖర్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండీ షకీల్, పిల్లి సోమయ్య, రేఖల సోమయ్య, బీరప్ప, బీరుమల్లు, మల్లుస్వామి, పూజారి నాగరాజు, మందుల వెంకటేష్, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.