అడ్డగూడూరు పీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 28 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం(పి.హెచ్.సి)లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్"బి భార్గవి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ చిన్నారులకు పోలియో చుక్కలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి(డి ఎం హెచ్ ఓ)డా"మనోహర్, పి.ఓ(ఎన్‌సీడీ)డా"వీణ, వైద్యాధికారి,డీపీఎచ్‌ఎన్‌ఓ సత్యవతి,పీహెచ్‌సీ సిబ్బంది,ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, పిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,డైరెక్టర్లు బాలేoల విద్యాసాగర్,చిత్తలూరి సోమన్న,మండల నాయకులు సురేష్,మందుల సోమన్న,ఊడుగు మల్లేష్,మేకల పవన్,వివిధ గ్రామాల సర్పంచులు,మహిళలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.