అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు . బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ

Mar 18, 2025 - 19:31
 0  5
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు . బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ

 , బాణాల అబ్రహం . కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ చౌరస్తాలో అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలపడం పట్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల పోరాట ఫలితంగా సుప్రీం కోర్ట్ జోక్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజిస్తూ సిఫారసులు చేయగా ప్రభుత్వ ఆమోదించి మంగళవారం నాడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టగా టిఆర్ఎస్ , బిజెపి , సిపిఐ , ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించటం పట్ల , కోదాడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచ కాలసి స్వీట్లు పంపిణీ చేశారు , ఈ ఉద్యమంలో అనేకమంది బలిదానాలు జరిగాయి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల మనోభావాలను గౌరవిస్తూ చేసిన ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉంటారని దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు . బాబు మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి , టపాసులు కాల్చి , స్వీట్లు పంచుకున్నారు సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణకై పోరాట ఫలితంగా , ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిండు అసెంబ్లీ సమావేశంలో మాట ఇచ్చి ఆమాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చైర్మన్గా భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీ నియమించిన వెంటనే 90 రోజులలో వర్గీకరణ నివేదికను ఫిబ్రవరి 4వ తారీఖున తీర్మానం చేయటం జరిగిందని అంతే కాకుండా మొన్న రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి . ఎస్సీ వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఉప చైర్మన్ దామోదర్ రాజనర్సింహ మరియు తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ కు కృతజ్ఞతలు తెలియ జేశారు . కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు అండగా ఉంటారని తెలిపారు . ఈ కార్యక్రమం తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి , కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం , పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి , ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరు నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి , ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు పిడమర్తి బాబురావు , కాంపాటి చంటి , పంది వెంకటి , ఏర్పుల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333