నేలకొండపల్లిలో దారుణ హత్యకు గురైన కుటుంబాన్ని ఓదార్చిన
ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు:- నేల కొండపల్లి కుమారి వెంకటరమణ దంపతుల కుటుంబాన్ని పరామర్శించిన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు నెలకొండపల్లిలో దారుణ హత్యకు గురైనయర్రా వెంకటరమణ కుమారి దంపతులకు నివాళులు అర్పించి కుమారుడు నరేష్ ను తమ్ముడు రమేష్ ను ఓదార్చారు మీ కుటుంబానికి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి మీకు అండగా ఉంటాను అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు, పట్టణ కోశాధికారి తెల్లాకుల అశోక్ మాజీ మండల అధ్యక్షులు కొత్త రమేష్ మాటూరు సుబ్రహ్మణ్యం దోస పాటి అచ్యుతరామయ్య నాళ్ళ సాయి పాల్గొన్నారు