అంబరాన్ని తాకిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తిరుమలగిరి 16 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అంబరాన్ని తాకాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడగా, దేశభక్తి భావం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ,16 గ్రామ పంచాయతీలో ,పాఠశాలలు, కళాశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కేంద్రాలలో వివిధ సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల విద్యార్థులు, యువత, ప్రజలతో దేశభక్తి ర్యాలీలు చేపట్టారు. జైహింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో వీధులు మార్మోగాయి.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సామెల్ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.