అందుబాటు.. రవాణా సౌలభ్యం.. భద్రత.
బిజెపి రాష్ట్ర యువనేత స్నిగ్ధారెడ్డి
➖కోర్టుకు ఈ ప్రమాణాలు తప్పనిసరి
➖ బిజెపి రాష్ట్ర యువనేత స్నిగ్ధారెడ్డి
జోగులాంబ గద్వాల 11 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కోర్టు సముదాయం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలంటే మూడు అంశాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర యువనేత స్నిగ్ధారెడ్డి అన్నారు. గురవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు టి రామాంజనేయులు ఇతర సీనియర్ నాయకులతో కలసి ఆమే మాట్లాడుతు...కోర్టు అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి, రవాణా సౌకర్యం కలిగి ఉండాలి, అలాగే సురక్షితమైన మరియు భద్రత కలిగిన ప్రాంతంలో ఉండాలి అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతిపాదిత అనంతపురం గుట్టల వద్ద ఈ మూడు ప్రాథమిక ప్రమాణాలు పూర్తిస్థాయిలో లేవని తమ పార్టీ బలంగా విశ్వసిస్తోందన్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలనా అనుకూలత, న్యాయవాదులు, కక్షిదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్‌డీవో కార్యాలయ పరిసర ప్రాంతం, కేఎల్‌ఐ అతిథి గృహ స్థలం, సిద్ధాంతాల వారి కుంట లేదా గద్వాల పట్టణ సమీపంలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భూములను పరిశీలించాలని పార్టీ తరఫున జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే అది వేలాది మంది ప్రజలకు సులభంగా చేరుకునే అనువైన ప్రదేశంలోనే నిర్మించాలనేదే భారతీయ జనతా పార్టీ అభిప్రాయమని స్నిగ్ధారెడ్డి స్పష్టం చేశారు.