త్రిబుల్ ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు
తిరుమలగిరి 01 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
శనివారం విడుదలైన త్రిబుల్ ఐటీ ప్రవేశ ఫలితాల్లో తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అక్కల సాయి చరణ్ ,మల్కాపురి ప్రజ్వ విద్యార్థులు మోడల్ స్కూల్ కు చెందిన సిహెచ్ ప్రణవి విద్యార్థిని త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించారని. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ ప్రవేశానికి అర్హత సాధించి ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను మరింత పెంచిందన్నారు. పట్టుదల, కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో ఈ విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు సమాజాభివృద్ధికి తమ వంతు సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సాధించిన విజయం పాఠశాల ఉపాధ్యాయుల నిబద్ధతకు, విద్యార్థుల కృషికి నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది విద్యార్థులను అభినందించి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.