సూర్యాపేట జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తిరుమలగిరి 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని మద్దిరాల మండలం లో కేజీబీవీ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది పాఠశాల రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది ఆరో తరగతి విద్యార్థిని మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యహత్నం చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తీవ్ర గాయాలైన విద్యార్థిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు శుక్రవారం ఉదయం జరగగా కేజీబీవీ పాఠశాల యాజమాన్యం సాయంత్రం వరకు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు...