సూర్యాపేట జిల్లా పోలీస్ - డయల్ 100 మెరుపు స్పందన

May 26, 2026 - 19:32
 0  1
సూర్యాపేట జిల్లా పోలీస్ - డయల్ 100 మెరుపు స్పందన
సూర్యాపేట జిల్లా పోలీస్ - డయల్ 100 మెరుపు స్పందన
సూర్యాపేట జిల్లా పోలీస్ - డయల్ 100 మెరుపు స్పందన

ఆపదలో ఉన్నారా? డయల్ 100 కి కాల్ చేయండి! ????

సగటున 10 నిమిషాల్లో బాధితులకు పోలీస్ సేవలు

డయల్ 100 ఫిర్యాదులపై సూర్యాపేట పోలీసుల మెరుపు స్పందన – సగటున 10 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరికసూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ డయల్ 100 పిర్యాదులపై జిల్లా పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా స్పందిస్తోంది. ఆపదలో ఉన్న బాధితులు డయల్ 100కు కాల్ చేసిన వెంటనే పోలీసులు నిమిషాల వ్యవధిలో వారి వద్దకు చేరుకుని అవసరమైన సేవలు అందిస్తున్నారు. 

కేవలం 10 నిమిషాల్లోనే స్పందన: జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నిన్న (సోమవారం) వచ్చిన డయల్ 100 ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది రికార్డు స్థాయిలో స్పందించారు. కాల్ వచ్చిన సగటున 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలాలకు చేరుకుని, బాధితులకు తక్షణ సహాయం అందించి అండగా నిలిచారు.

నిరంతరం అందుబాటులో ప్రత్యేక బృందాలు: డయల్ 100 కాల్స్ పై తక్షణమే స్పందించి బాధితులకు సేవలు అందించడానికి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు ప్రత్యేకంగా 3 నుండి 5 బృందాలు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నాయి. బ్లూ కోట్స్ మరియు పెట్రోకార్ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అత్యంత వేగంగా స్పందిస్తున్నారు. 

సిబ్బందికి నిరంతర శిక్షణ: డయల్ 100 కాల్స్ పై స్పందించడంలో సిబ్బంది సామర్థ్యాన్ని, పనితీరును మరింత మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆధునిక కాలానికి అనుగుణంగా బాధితులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నాం. ప్రజలు అత్యవసర సమయాల్లో ఎలాంటి సంకోచం లేకుండా డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.

బాధితుల ఇంటి వద్ద నుండి కేసులు నమోదు చేస్తున్న సూర్యాపేట జిల్లా పోలీస్..

బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సంఘటనలపై బాధితుల ఇండ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఇంటి వద్ద నుండే కేసు నమోదు చేస్తున్న సూర్యాపేట జిల్లా పోలీస్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ బాధితులకు ఇంటివద్దే పోలీసు సేవలు అందించడం జరుగుతుంది.
 
మహిళల బాలల వృద్దుల పట్ల ఆకృత్యాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు, వ్యక్తులపై భౌతిక దాడులు జరిగినప్పుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆకృత్యాలు జరిగినప్పుడు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ జరిగినప్పుడు, బాల్య వివాహాలు జరిగే సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్ద లేదా వారికి అనుకూలమైన ప్రదేశంలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి కేసు పత్రాన్ని బాధితులకు అందజేస్తున్నాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333