సర్వే చేయండి.... మాకు న్యాయం చేయండి

Sep 15, 2024 - 02:14
Sep 15, 2024 - 22:04
 0  283
సర్వే చేయండి.... మాకు న్యాయం చేయండి

తొండ గ్రామంలో దొరల పెత్తనం.. 

 ప్రభుత్వాలు మారిన వాళ్ల తీరు మారలేదు... 

పలు సర్వే నెంబర్లలో మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నాం.... 

దేవుని మాన్యం... చెరువు సిక్కం.. పోరంబోకు...

భాన్ చ్చరాయి భూములన్ని వారీవే.... 

ధరణి పోర్టల్ ద్వారా భూకబ్జా దారులకు ఒక వరం 

రెవెన్యూ అధికారులు వారివైపే

 క్రిమినల్ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తరు.... 

డబ్బు బలంతో అధికారులకు వల..? 

రెవెన్యూ అధికారులరా..స్పందించండి న్యాయం చేయండి... 

తిరుమలగిరి 15 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ని చిత్తలూరి జలాల్,. కుమారుడు నాగరాజు లకు ఉన్న భూమిని గ్రామానికి చెందిన గుణగంటి సుధీర్ రావు, అనిల్ రావులు అన్యాయంగా మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని చంపుతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నరని గ్రామపంచాయతీ వద్ద మీడియా ముందు వాపోయారు. 305, 306,113 సర్వే నెంబర్ల లో ఉన్న భూమిని మూడు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. గ్రామానికి చెందిన గుణగంటి సుధీర్ రావు,అనిల్ రావులు మా పక్కనే ఉన్న భూమిని అమ్ముకునే హైదరాబాదులో ఉంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ రావడంతో వారికి లేని భూమిని ఉన్నట్లు రికార్డులు సృష్టించి గ్రామానికి వచ్చి మాకు భూమి ఉంది అంటూ మేము సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకున్నాడు. ఇది అన్యాయం అంటూ స్థానిక రెవిన్యూ అధికారులకు పలు మార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేకాకుండా మమ్ములను చంపుతామంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని అన్నారు. అంతటితో ఆగకుండా మా పైనే క్రిమినల్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్న మాకు న్యాయం జరగడంలేదని వాపోయారు. సుధీర్ రావు, అనిల్ రావులకు ఆర్థిక బలం ఉండడంతో మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి గ్రామానికి వచ్చి దర్యాప్తు చేసి మాభూమి మాకు ఇప్పించి, న్యాయం చేయగలరని వేడుకున్నారు. వారి వెంట పలువురు రైతులు వాస్తవంగా ఆ భూములు చిత్తలూరు జలాల్ అతని కుమారులు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నారని అన్యాయంగా వారు భూమి నీ కబ్జా చేశారన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034