స్కూల్ బస్సులు గా మారిన ప్రైవేట్ ఆటోలు
చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేస్తున్న విద్యాశాఖ
జోగులాంబ గద్వాల 2 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. అయిజ పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను చేరవేసేందుకు బస్సులకని విద్యార్థులతో ఆ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు ఆటోలలో పరిమితికి మించి తరలిస్తున్నారు. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారికి తెలిసిన తనకేమి పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. గ్లోబల్ , లయోలా, ఠాగూర్, అక్షర, తదితర పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను ప్రవేటు వాహనాలలో నిర్లక్ష్యంగా తరిస్తున్నారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి తర్వాత మళ్లీ ఆ పాఠశాలలో వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ విషయం పై జిల్లా కలెక్టర్ స్పందించి ఆటోలలో తరలిస్తున్న విద్యార్థులకు స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలని ఐజ పట్టణ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.