సమయపాలన పాటించని అధికారులు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం
జోగులాంబ గద్వాల 21 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లాలోని అధికారులు సమయపాలన పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్ల సమయానికి కావాల్సిన పనులు కాక జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా లోని నాలుగు మున్సిపాలిటీలు. వడ్డేపల్లి. ఐజ. అల్లంపూర్ గద్వాల పట్టణ కేంద్రాల్లోనూ. అధికారులు విధులకు గై హాజరు కావడం ఆనవాయితుగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి. ఒక నిండు ప్రాణం ఈ మధ్యకాలంలోనే జిల్లా వైద్య కేంద్రంలో జరిగింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ రాజోలు వైద్య ఆరోగ్య కేంద్రం సందర్శించినప్పుడు అధికారులు విధులకు రాకుండానే. నెల నెల జీతాలు తీసుకొని తమ సొంత పనులు చేసుకుని హాజరు రిజిస్టర్లో సంతకాలు లేకుండా ఉండడం చూసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేకు సంబంధిత అధికారికి సోకాజు నోటీసులు జారీ చేయమని ఆదేశించారు. ఒక రాజోలి వైద్య ఆరోగ్యశాఖనే కాదు జిల్లాలోని 12 మండలాల్లోనూ అదే దుస్థితి పరిశీలిస్తే కనబడుతుంది. ఎక్కడ అధికారులు సమయపాలన పాటించకుండానే వచ్చినప్పుడు హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసుకొని జీతాలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ పరిధిలో ఉండాల్సి ఉండగా. వాళ్ళు ఎక్కడుంటారో ఏమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల నిత్య పర్యవేక్షణ చేసే తప్ప అధికారులు ఆగడాలు అరికట్టలేని పరిస్థితి కనబడుతుంది. గ్రామాల్లోని ప్రజలు తమ ఇబ్బందులను గూర్చి. మండల స్థాయి అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని పై స్థాయి అధికారులకు. జిల్లాస్థాయి అధికారులకు చెప్పలేక నోటికి వేళ్ళు వేసుకొని వేణు తిరిగి కామన్ గా ఉంటున్నారు. ప్రతి గ్రామపంచాయతీలోని అన్ని శాఖల అధికారుల పనిలో నిర్లక్ష్యం వివరిస్తుంది. అంగనవాడి ఆశ . ఏఎన్ఎంలు. విద్యుత్తు లైన్ మాన్. వ్యవసాయ విస్తరణ అధికారులు కార్యదర్శులు. గ్రామ పరిపాలన అధికారులు. మొత్తం 16 శాఖల అధికారులు గ్రామాల్లో నిధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మైనింగ్ ఏడి నిధుల నిర్వహణలో అధికారి ఎప్పుడు వచ్చేది ఎవరు కి తెలియని పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖలో కూడా పై దుస్థితి కనపడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అధికారులు పనితీరులో మెరుగు పడాల్సి ఉండగా అధికారులు మార్పు రాకపోవడంతో సదాస్థితి యదా స్థితి అన్నట్లుగా పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల పరిరక్షణ దృష్టి పెట్టి నిర్లక్ష్యం ఇస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.