శ్రీ రాముల వారి దేవాలయం పనుల పున ప్రారంభం
తిరుమలగిరి 16 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని పురాతనమైన శ్రీ రాములవారి దేవాలయం గత 20 సంవత్సరాలుగా అన్యక్రాంతమై భూస్వాముల స్వార్థానికి శిథిలమై ఉన్నటువంటి గుడిని గ్రామ ప్రజలు చైతన్యవంతమై దేవాలయానికి అన్యకాంతమైన భూమిని కాపాడడం కోసం ఒక కమిటీగా ఏర్పడి దేవాలయానికి పూర్వ వైభవం తేవడానికి సోమవారం రోజున 17వ తారీఖున జరిగే శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేవాలయ పనులకు శ్రీకారం చుట్టారు ఈ ఈ సందర్భంగా శ్రీ రాములవారి దేవాలయం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రములవారి దేవాలయానికి దేవాదాయ శాఖ వారు స్పందించి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు భక్తులు గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు.
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాదాయ భూమిని స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు కావున వారి నుండి దేవాదాయ భూమిని దేవాదాయ శాఖ వారు తొండ గ్రామానికి శ్రీరాముల దేవాలయానికి ఇవ్వవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వేల్పుల వెంకటయ్య, భూతం రవి, పోరెల్ల లక్ష్మయ్య, ఓడపల్లి వెంకన్న, వేల్పుల బంగారు రాజు చిత్తలూరి రాజు, ఎల్లంల బాలరాజు, బైరెడ్డి ఎసురెడ్డి, గొలుసుల మల్లయ్య, వేల్పుల నరసయ్య, పాక ఉపేందర్,ఎర్రగట్టు లింగన్న, నీరేటి ప్రవీణ్, వేల్పుల శ్రీనివాస్, ఎల్లంలా మహేష్, ఎల్లంలా శ్రీశైలం, వెలుగొండ యాదగిరి, గోల్కొండ సైదులు, పల్లెర్ల బిక్షం, నాగులు గాని హరీష్, నాగుల గాని వెంకన్న,మోహన్ రావు కరెంట్ రవి,గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు