వీల్ చైర్ ద్వారా అమ్మవారి దర్శనం సులువు

Feb 6, 2026 - 16:16
 0  5
వీల్ చైర్ ద్వారా అమ్మవారి దర్శనం సులువు

 జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవస్థానంలో శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో వయోవృద్ధులు దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీలు చైర్ లో వారిని కూర్చోబెట్టి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లి దేవాలయ సిబ్బంది సేవలందిస్తున్నారు. మల్లకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన ఈజీకే తిరుమల రావు ను వీల్ చైర్ లో తీసుకెళ్లే అమ్మవారి దర్శనం చేయించారు.దేవాలయ ఈవో పురందర కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర తదితర ప్రాంతాల అమ్మవారి భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు సమర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333