వెలిశాలలో జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
తిరుమలగిరి 12 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో జనగణన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ప్రారంభించారు.ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు మరియు గ్రామాభివృద్ధికి ఖచ్చితమైన జనగణన ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబ వివరాలను సక్రమంగా నమోదు చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు .ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరాలంటే ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలు ఇవ్వాలని గ్రామ సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు...