విద్యా, నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ

Jul 27, 2024 - 20:33
Jul 27, 2024 - 20:34
 0  1
విద్యా, నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ

తెలంగాణ వార్త ఆత్మకూరుయస్:-  విద్యా, నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించి,జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. PDSU -PYL* ఆత్మకూరు(S) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ దగ్గర విద్యా, నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా PDSU జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి PYL జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య మాటలాడుతూ* రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రెండవసారి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై నిరుద్యోగులు, విద్యార్థులు గంపెడంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ను చూస్తే ఉసురుమనేలా ఉంది. రాష్ట్ర బడ్జెట్ ను పరిశీలిస్తే నిరుద్యోగం,విద్యా అంశాలను గాలికి వదిలేసినట్లు కనిపిస్తుంది. విద్యార్థులకు ఇవ్వవలసిన సుమారు 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు. వాటి ఊసే ఎత్తలేదు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు రెడ్ కార్పెట్ పరచడం, ఫీజుల దోపిడీకి.ఈ కార్యక్రమం PDSU డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, జలగం సుమంత్ విడమర్తి భరత్ PYL జిల్లా కోశాధికారి బండి రవి, POW జిల్లా ప్రధానకార్యదర్శి కంచర్ల నరసమ్మ కాలేజ్ విద్యార్థులు, సంధ్య,మానస, ప్రవళిక,శైలజ,ప్రియాంక,మహేష్, నవీన్, గోపి తదితరులు పాల్గొన్నారు.*