విద్యతోపాటు పర్యావరణం గురించి అవగాహన కల్పించడం అభినందనయం
విద్యతోపాటు పర్యావరణం గురించి అవగాహన కల్పించడం అభినందనీయం
సి.జి.ఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఔషధ మొక్కల పంపిణీ
పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మున్సిపల్ చైర్ పర్సన్ సూర్యాపేట
తెలంగాణవార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా ఆగస్టు 14 : జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో బుధవారం స్కూల్ ఎర్త్ క్లబ్ - యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ పిల్లలకు విద్య తోపాటు పర్యావరణం గురించి మొక్కల గురించి పరిచయం చేయడం పిల్లల్లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.భావి తరాలకు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ప్రతి పిల్లవానికి మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. .అనంతరం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూవేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి మాట్లాడుతూ మనం మట్టి,గాలి, నీరు కు నిత్యం సంబందం కలిగి ఉన్నాం. ఇవి లేకపోతే మానవుని మనుగడ లేదని మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం, ఔషద మొక్కల ఉపయోగం పై అవగాహణ కల్పించారు.సూర్యాపేట జిల్లాలోని జడ్పీ బాలుర పాఠశాలలో యాభై ఔషద మొక్కలు పాఠశాల ప్రధానోపాధ్యారాలు గోలీ పద్మ లకు అందజేశారు.పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఎర్త్ లీడర్ సభ్యులు మెడిసినల్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో డిఎస్ఓ దేవరాజ్, ఎస్ ఓ ఎర్రంశెట్టి రాంబాబు, సిజిఆర్ జిల్లా బాధ్యులు మామిడి శంకర్, జన్య ఫౌండేషన్ మేనేజర్ శివకుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివకుమార్, చైతన్య మహిళా సాధికారత జిల్లా ఇంచార్జ్, పాఠశాల మెంటార్ ఉపాధ్యాయులు విశ్వజ్ఞ చారి,లీడ్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.