వి బి జి రామ్ జి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. సిఐటియు జిల్లా కార్యదర్శి **నెమ్మాది
2026 జూలై 1 నుండీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి,VBG రామ్ G చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ VBG Ram G చట్టాన్ని ఉపసంహరించుకోవాలని,ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాని డిమాండ్ చేశారు
స్థానిక కోదాడ పట్టణం సిఐటియు కార్యాలయంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో కేంద్ర ప్రభుత్వం పై పార్లమెంట్లో వాము పక్ష పార్టీలు పోరాడి తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని దీనిని సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసిపెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పై ఉద్యమాలు నిర్వహించాలని వారు అన్నారు. కొత్తగా వచ్చిన చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిచేస్తున్న ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారన్నారు.జూలై 1న గ్రామస్థాయిలలో నిరసనలు చేపట్టాలని జూలై 29న చలో ఢిల్లీలో జరిగే మూడు సంఘాల అఖిలభారత జాతీయ సదస్సుకు కార్మిక కర్షక నాయకత్వం తరలిరావాలని, ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ యొక్క సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ ఎం ముత్యాలు, రాములు రామారావు వీరయ్య వెంకటేశ్వర్లు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు