మానవపాడు మండలానికి మిషన్ భగీరథ వాటర్ తనిఖీ నిమిత్తమున విచ్చేసిన DE రవిచంద్ర రెడ్డి కి మరొక DE కృష్ణ కి

Jun 5, 2026 - 19:33
 0  0
మానవపాడు మండలానికి మిషన్ భగీరథ వాటర్ తనిఖీ నిమిత్తమున విచ్చేసిన DE రవిచంద్ర రెడ్డి కి మరొక DE కృష్ణ కి

 జోగులాంబ గద్వాల జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  అమరవాయి గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు పది రోజుల నుండి రావడం లేదు ప్రజలు నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు, కనీసం తాగడానికి ఒక బిందె కూడా రావడం లేదు. దయచేసి జూరాల దగ్గర రెండు మోటార్లు ఆన్ లో నడుస్తున్నాయి మూడవ మోటారు కూడా ఆన్ చేసి మా గ్రామాల ప్రజల నీటి కష్టాలు తీర్చమని మానవపాడు సర్పంచ్ రాజేంద్రప్రసాద్,, అమరవాయి సర్పంచ్ హుస్సేన్,, వార్డు మెంబర్ రాజేష్ మరియు మానవపాడు అమరవాయి గ్రామ ప్రజలు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

DE సానుకూలంగా స్పందిస్తూ జూరాల దగ్గర మూడవ పంపు రిపేర్ లో ఉంది అది త్వరలోనే రిపేరు చేయించి ఆన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని నీటి సమస్య లేకుండా చూస్తామని సర్పంచులకు, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో మానవపాడు సర్పంచ్ రాజేంద్రప్రసాద్,, అమరవాయి సర్పంచ్  హుస్సేన్,, వార్డ్ మెంబర్ రాజేష్,, కాంగ్రెస్ నాయకులు తదితరులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333