పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలిగా మిట్టపల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం

Jul 21, 2026 - 00:15
 0  2
పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలిగా మిట్టపల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం

సూర్యాపేట పట్టణ ఆర్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా మహిళల సాధికారత కోసం తనవంతు కృషి చేస్తానని,  ఆర్యవైశ్య మహిళలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలు పట్ల అవగాహన కల్పించే  విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని పట్టణ ఆర్యవైశ్య  మహిళా సంఘం అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి అన్నారు. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా మిట్టపల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాయపూడి భవాని ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ అధ్యక్షురాలుగా  బ్రాహ్మడ్లపల్లి తరంగిణి, వర్కింగ్ ప్రెసిడెంట్  బెలిదే రాధ, సెక్రటరీ లకుమారపు పద్మజ, ట్రెజరర్ ఓరుగంటి లావణ్య , ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యురాలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు  తన పిల్లల్ని తన కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా వారికి బంగారు భవిష్యత్తు నిర్మాణం చేస్తారని అటువంటివారు సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఆర్యవైశ్య మహిళలకు పేదవారికి కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని,  సంఘం నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ,  ఊరే లక్ష్మణ్,  పట్టణ అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు, కర్నాటి కిషన్  జిల్లా అద్యక్షులు వెంపటి వెంకటేశ్వర రావు, ,చల్లా లక్ష్మీకాంత్, ఇమ్మడి సోమనరసయ్య, బండారు రాజా, మిట్టపల్లి రమేష్  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333