ముగ్గురు కానిస్టేబుల్ ల సస్పెన్షన్.
ఉత్తర్వులు జారీచేసిన సూర్యాపేట జిల్లా ఎస్పి.
సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న కానిస్టేబుల్స్ ఎం.రాంబాబు, ఎం.బాలకృష్ణ, ఏల్.పూర్ణచందర్ ముగ్గురు కానిస్టేబుళ్లు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలపై విచారణ చేసి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సోమవారం రోజున జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది ఎవరైనా విధులు నిర్వహణలో అక్రమాలకు ఇకపై శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.