రేపు కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం""మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

రేపు కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం
ముఖ్యఅతిధులుగా హాజరు కానున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మంజిల్లా పీసీసీ అబ్జర్వర్ నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్*
* కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణంపై పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈనెల 6వ తేదీన మంగళవారం (రేపు) మధ్యాహ్నం 12గంటలకు జరగనుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఖమ్మంజిల్లా పీసీసీ అబ్జర్వర్ నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ హాజరవుతారని తెలిపారు. కావున పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీల, ఆత్మకమిటీ, సీడీసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరు పాల్గొనగలరని మనవి*
* ఇట్లు
* * వెన్నపూసల సీతారాములు
* AMC చైర్మన్