డిగ్రీ కళాశాల విషయంలో అయిజ పట్టణ మండల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

బి ఆర్ ఎస్ పార్టీలు

Jul 10, 2024 - 19:22
 0  2
డిగ్రీ కళాశాల విషయంలో అయిజ పట్టణ మండల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రారెడ్డి 

జోగులాంబ గద్వాల 11 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూన్ 21వ తేదీన దేవరకద్ర నూతన డిగ్రీ కళాశాల మంజూరు కావటం జరిగింది అదేవిధంగా జులై 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి రెండు డిగ్రీ కాలేజీలు మంజూరు చేశారు కొడంగల్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల మరియు అదే నియోజకవర్గంలో మద్దూరు మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరి మన దగ్గర ఉన్నటువంటి నాయకులు అనగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ -ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచిన BRS పార్టీ నాయకులు, MLC గా ఉన్న BRS నాయకులు ఏం చేస్తున్నారు అయిజ పట్టణ మండల మరియు సమీప మండల గ్రామాల్లో అమాయకపు పేద ప్రజల పిల్లలు ఉన్నత విద్యను చదువుకోనివ్వకుండా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు కావాలని అడ్డుకుంటున్నాయి.ఇక్కడ ప్రజలవి 70 వేల ఓట్లు ఓట్లు కావా? వారి ఓటుకు విలువ లేదా?వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిజ పట్టణ మండల ప్రజలు కచ్చితంగా ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు దేవరకద్ర, కొడంగల్,మద్దూర్ పట్టణాలు అయిజ కంటే జనాభాపరంగా చాలా చిన్నవి.అయిజ పట్టణం కంటే చిన్న పట్టణాలకు డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తే మరి అయిజ పట్టణానికి ఏమైంది? ఇక్కడ ఆరు జూనియర్ కళాశాల లు(1 ప్రభుత్వ+1 గురుకుల+1kgbv+మూడు ప్రైవేట్ కళాశాలలు) ఉన్నాయి.

ప్రత్యక్ష కార్యాచరణ:- ఆగస్టు 15 నెలలోపు అయిజ పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు& విద్యార్థిని విద్యార్థులకు వసతి గృహాలు (పోస్టుమేట్రిక్ హాస్టల్స్) మంజూరు ఉత్తర్వులు రాకపోతే ఆగస్టు 16వ తేదీ నుండి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణకు, ఆందోళనలకు సిద్ధమవుతామని జోగులాంబ గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎస్.రామచంద్ర రెడ్డి  పేర్కొన్నారు

 ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు  బింగి దొడ్డి గోపాల కృష్ణ,  నరసింహ శెట్టి , జిల్లా నాయకులు మేడి కొండ భీమ్ సేన్ రావ్ ఉప్పల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిలు కంపాటి భగత్ రెడ్డి, ప్రదీప్ స్వామి , నాయకులు  రఘు, వీరేష్ గౌడు తదితరులు పాల్గొన్నారు ....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333