మల్దకల్‌లో ప్రీ-ప్రైమరీ పాఠశాలల టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Jun 5, 2026 - 19:29
 0  0
మల్దకల్‌లో ప్రీ-ప్రైమరీ పాఠశాలల టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తులను పరిశీలిస్తున్న మండల విద్యాధికారి (MEO)

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపునకు చర్యలు

 జోగులాంబ గద్వాల 5జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. జూన్ 5:మండల కేంద్రంలోని మల్దకల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభం కానున్న ప్రీ-ప్రైమరీ  తరగతుల్లో బోధన కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా సాగింది. స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాధికారి (MEO) ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన మహిళా అభ్యర్థులు, ఉపాధ్యాయ పోస్టుల కొరకు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో విచ్చేసి దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ  మాట్లాడుతూ, మండలంలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. చిన్న వయస్సు నుంచే పిల్లలకు నాణ్యమైన పునాది విద్యను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చిన దరఖాస్తులను మెరిట్ మరియు నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా పరిశీలించి తగిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, సిఆర్పీలు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333