బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం 

Jun 5, 2026 - 19:29
 0  0
బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం 
బిజెపి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం 

 జోగులాంబ గద్వాల 5జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా శాఖ ఆధ్వర్యం లో  నిర్వహిస్తున్న  పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం గద్వాల పట్టణంలోని ఎస్వీ ఈవెంట్ హల్ లో  జిల్లా అధ్యక్షులు టి.రామాంజనేయులు అధ్యక్షతన 4,5 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో జిల్లా నలుమూలల నుండి సుమారు 250 మంది పార్టీ ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు ముగింపు సమరోప్  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ సైదాంతిక భూమిక, బిజెపి చరిత్ర వికాసం, కార్య విస్తరణ పై మన ఆలోచన, మన కార్య పద్ధతి, భావజాల పరివార క్షేత్రాలు, కార్యకర్త వికాసం మరియు బాధ్యతలు, దేశం ఎదుర్కొంటున్న రాజకీయ సామాజిక సవాళ్లు, మోడీ ప్రభుత్వంలో పేదల సంక్షేమ పథకాలు చిట్టచివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు100% లబ్ధిదారుల సంతృప్తి, సోషల్ మీడియా ప్రాముఖ్యత , మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మరియు మీడియా నిర్వహణ మరియు ఏర్పాట్లు, వ్యవహారీక ఆలోచనలు, బూత్ నిర్వహణ మన్ కీ బాత్ మరియు ఎస్ ఐ ఆర్, గీత్ వంటి 12 అంశాల పైన రాష్ట్ర పార్టీ నుండి 12 మంది వక్తలు వచ్చి క్లుప్తంగా వివరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా జాతీయ పునర్నిర్మాణానికి అంకితమైన ఉద్యమంగా ఎదిగిందని పేర్కొన్నారు. సిద్ధాంతాలు, విలువలు, క్రమశిక్షణ, సేవా భావం ఆధారంగా పార్టీ కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. బిజెపి చరిత్ర, వికాసం, సిద్ధాంతాలపై సమగ్ర అవగాహన ప్రతి కార్యకర్తకు ఉండాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై విశిష్ట స్థానాన్ని సంపాదించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను అర్థం చేసుకొని ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయగల నాయకత్వాన్ని కార్యకర్తలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి బాపు రెడ్డి , బిజెపి జిల్లా యువ నాయకురాలు డికె.స్నిగ్ద రెడ్డి,జిల్లా ప్రశిక్షణ ప్రబారి రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లు రవికుమార్ ఎక్బోటే, కేకే. రెడ్డి, శ్యామ్ రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు, అక్కల రమాదేవి ,అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా శివారెడ్డి, రాజగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు టి. కృష్ణ వేణి, బండల పద్మావతి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, కౌన్సిలర్ కుమ్మరి శ్రీను,శాలన్న,చంద్రశేఖర్   తదితరులు హాజరయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333