భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం..
బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి.
జోగులాంబ గద్వాల 2 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల అధ్యక్షులకు, కౌన్సిలర్లు ,వార్డు ఇంచార్జ్ లు, బూతు అధ్యక్షులు, ప్రజలు ,కార్యకర్తలకు, తెలియజేయడమేమనగా. ఈ నెల 4వ తేదీన శనివారం సాయంత్రం 4:00 గంటలకు తెరు మైదానం లో భారీ బహిరంగ సభ ఉండును..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కేంద్ర సహకార ప్రసారాల శాఖ సహాయ మంత్రి మురుగన్ ,మరియు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డికె. అరుణమ్మ , ఎంపీ రాములు , నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ . హాజరుకానున్నారు.. ఇట్టి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు..