భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలనుజయప్రదం చేయండి

Dec 31, 2024 - 17:38
 0  2
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు

హంస ఫౌండేషన్ చైర్ పర్సన్ చెరుకు లక్ష్మి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న ఆధ్వర్యంలో ముద్రించిన సావిత్రిబాయి పూలే  వేడుకల బ్రోచర్లను  నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో డాక్టర్ చెరుకు  లక్ష్మీ గృహంలో బ్రోచర్లను ఆవిష్కరించినారు అనంతరం ఆమె మాట్లాడుతూ అగ్రవర్ణ పెత్తందారులకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలే  సహకారంతో విద్య నేర్చుకొని 1848 జనవరి 1న  బడుగు బలహీన వర్గాల బాల బాలికల కోసం పాఠశాలను స్థాపించి నారు నాటి బ్రాహ్మణ సమాజం అవమానపరుస్తూ హేళన చేశారు అయినా గానీ ధైర్యశాలి అయినా సావిత్రిబాయి పూలే  నాటి కాలంలో సతీసహగమన ఆచారం  వితంతువులకు పునర్వివాహం  దురాచారాలను రూపుమాపి చీకటిని ప్రాణదోలీ సమాజంలో వెలుగులు నింపిన గొప్ప జ్ఞాన జ్యోతులను వెలిగించింది మనమందరం ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జనవరి 5 2025 న హైదరాబాద్ మహానగరంలో చిక్కడపల్లి నందు త్యాగరాయ గాన సభలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద   వెంకన్న ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రతిభావంతులు కవులు కళాకారులు రచయితలు సామాజికవేత్తలు  సావిత్రిబాయి పూలే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డు 2025ను ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానం చేస్తారు ఇట్టి కార్యక్రమాన్ని సాహితీవేత్తలు సామాజిక కార్యకర్తలు కళాభిమానులు అందరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బోడ సునీల్  వంగూరి ప్రసాద్ బట్ట శ్రీనివాస్ కారుపాట అంబేద్కర్ వంగూరి శ్రవణ్ వంగూరి వెంకీ ముక్కాబుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333