బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన కోదాడ పోలీసులు

Jul 21, 2026 - 17:31
 0  0
బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన కోదాడ పోలీసులు
బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన కోదాడ పోలీసులు
బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసిన కోదాడ పోలీసులు

పోలీసు స్పెషల్ డ్రైవ్, 40 బుల్లెట్ బైక్ లు గుర్తింపు.

హాజరైన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు.

- అతివేగంగా, పెద్ద శబ్దాలతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులు పెడితే సహించం.
- యువత ఆదర్శంగా ఉంటూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

కోదాడ టౌన్: నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ల సైలెన్సర్లు మార్చి, అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై కోదాడ పట్టణ, కోదాడ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సైలెన్సర్ లు మార్చి అధిక శబ్దంతో పట్టణంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడం కోసం స్పెషల్ నిర్వహించారు అని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు, ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా సీజ్ చేసిన 40 మోడిఫైడ్ సైలెన్సర్లను మంగళవారం పోలీసులు రోడ్డు రోలర్‌తో తొొక్కించి ధ్వంసం చేశారు. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. మితిమీరిన శబ్దాలు చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ సైలెన్సర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. యువత ఆదర్శంగా ఉండాలి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333