బాలలు బడిలో ఉండాలి వీధుల్లో కాదు

Aug 7, 2024 - 20:22
Aug 7, 2024 - 20:30
 0  5
బాలలు బడిలో ఉండాలి వీధుల్లో కాదు
బాలలు బడిలో ఉండాలి వీధుల్లో కాదు

స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ

*మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి*

చైల్డ్ కౌన్సిలర్ రజిని 

*గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి*

*జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ టేకుమట్ల సంధ్య* 

ఆగస్టు 7 ములుగు తెలంగాణ వార్త:- ములుగు : పిల్లలు బడిలో ఉండాలని వీధుల్లో కాదని వారు చదువుకుంటే మంచి పౌరులుగా నిలుస్తారని వారి జీవితంలో ఎదగాలంటే చదువు చాలా ముఖ్యమని ప్రాముఖ్యతను గ్రామ స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ అన్నారు,

బుధవారం ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో జిల్లా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ కౌన్సిలర్ టేకుమట్ల సంధ్య,గ్రామ కార్యదర్శి పోలు రాజు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు,

జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ సంధ్య మాట్లాడుతూ మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలని అందుకోసమని గ్రామాల్లో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ గ్రామ బాలల పరిరక్షణ కమిటీలను అభివృద్ధి చేయడం వల్ల పిల్లల సమస్యలు సులువుగా తెలుస్తాయని వెంటనే వాటికి పరిష్కారం మార్గం చూసే విధంగా చూడొచ్చని తెలియజేశారు. 

ప్రస్తుతము ఇప్పుడున్న సమయంలో పిల్లలందరూ డ్రగ్ కు బానిసలు అవుతున్నారు, పాఠశాల వెళ్లే విద్యార్థులలో డ్రగ్స్ కి బానిసలు అయిన పిల్లలు ఉన్నారు, అందుకని తల్లిదండ్రులు పిల్లలను గ్రహించి ముందుగా జాగ్రత్తలు తెలియజేసి వారికి మంచి పౌరులుగా తీర్చే తీర్చే విధంగా తల్లిదండ్రులు ఆలోచించాలని, అదేవిధంగా వాళ్ళు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి చదువు ముఖ్యమని తెలియజేయడం జరిగింది. 

చైల్డ్ లైన్ కౌన్సిలర్ M. రజిని గారు మాట్లడుతూ బడి బయట పిల్లలు ఉన్న విషయము తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫోన్ చేసి వివరాలు తెలియజేయండి అలా చేయడం వల్ల చెప్పిన వారి వివరాలు రహస్యంగా ఉండబడతాయి. మా సిబ్బంది వచ్చి అందుకు తగిన సపోర్టు వాళ్లకి ఇస్తారని చెప్పడం జరిగింది

 నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే వెంటనే 1098 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి పోలు రాజు గారు, అంగన్వాడి టీచర్స్,ANM, గ్రామస్తులు, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.